భారతదేశం, జనవరి 30 -- Thandel: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న తండేల్ మూవీ ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ కాబోతోంది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని జీఏ2 ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. తండేల్ రిలీజ్‌కు మ‌రో ఏడు రోజులు మాత్ర‌మే టైమ్ ఉండ‌టంతో సినిమా యూనిట్ భారీగా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తోంది.ఈవెంట్స్‌లో ప‌లువురు స్టార్ హీరోలు గెస్టులుగా సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

తండేల్ తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. మూడు భాష‌ల‌కు త‌గ్గ‌ట్లుగా ప్ర‌మోష‌న్స్ భారీగా నిర్వ‌హించ‌బోతున్నారు. తండేల్ త‌మిళ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ గురువారం (నేడు) చెన్నైలో జ‌రుగ‌నుంది. ఈ త‌మిళ ట్రైల‌ర్‌ను కోలీవుడ్ అగ్ర హీరో కార్తి రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే తండేల్ మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

శుక్...