Hyderabad, ఫిబ్రవరి 4 -- Producer Bunny Vasu About Thandel Story And Word: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టిన సినిమా తండేల్. హైలీ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించారు.

తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఇక సినిమా రిలీజ్ నేపథ్యంలో సోమవారం (ఫిబ్రవరి 3) నిర్మాత బన్నీ వాసు విలేకరుల సమావేశంలో తండేల్ మూవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు.

-నా క్లాస్‌మేట్ భాను కో ప్రొడ్యూసర్‌గా కూడా చేస్తాడు. రైటర్ కార్తిక్ దగ్గర ఈ కథ విని బావుందని నా దగ్గరికి తీసుకొచ్చాడు...