భారతదేశం, ఫిబ్రవరి 1 -- తండేల్ చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. యవసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. మూడు సాంగ్స్ పాపులర్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. అయితే, తండేల్ చిత్రానికి ముందుగా దేవీ వద్దని తాను అనుకున్నానని అల్లు అరవింద్ వివరించారు.

తండేల్ సినిమా కోసం నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు అరవింద్. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‍ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుందామని చందూ అంటే ముందు తాను వద్దన్నానని తెలిపారు.

పుష్ప 2 చిత్రం కూడా ఉండటంతో దేవీ ప్రసాద్ దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాడని, తండేల్‍...