Hyderabad, ఫిబ్రవరి 26 -- మహాశివరాత్రికి ఎంతో మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేసే సమయంలో కొన్ని రకాల పండ్లు, పానీయాలు తాగవచ్చు. రోజంతా ఏమీ తినకుండా ఉంటే శక్తి స్థాయిలు సన్నగిల్లుతాయి. ఉసవాసం చేసేటప్పుడు తాండై పానీయం తాగితే శక్తి వస్తుంది. అన్నట్టు దీన్ని శివరాత్రికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు.

హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండుగ శివ పార్వతులకు అంకితం చేశారు. భోళేనాథుడు. పార్వతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు ఇదేనని చెబుతారు. ఈ రోజున శివ భక్తులు పూజ చేసి, భక్తితో ఉపవాసం కూడా ఉంటారు. శివలింగానికి అభిషేకం చేస్తారు.

ఈ ఉపవాస సమయంలో ఫలహార పదార్థాలను తీసుకోవచ్చు. అంతేకాకుండా, మీకు అనారోగ్యంగా ఉన్నా, చాలా బలహీనంగా అనిపించినా సాత్విక ఆహారం తీసుకోవచ్చు. శివరాత్రి ఉపవాసాన్ని పిల్లల నుండి పెద్దలు వరకు అందరూ ఉంటారు. ఉపవాసం ఉండ...