భారతదేశం, మార్చి 20 -- మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ఈ ఏడాది జనవరి 10న విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్రంలో పాటలు కూడా పెద్దగా క్లిక్ అవలేదు. దీనిపై తమన్‍పై కూడా అసంతృప్తి వచ్చింది. అయితే, గేమ్ ఛేంజర్ పాటలు ఎందుకు పాపులర్ కాలేదో తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామెంట్లు చేశారు. రామ్‍చరణ్ అభిమానులకు ఆ మాటలు చాలా ఆగ్రహానికి గురి చేస్తున్నారు. దీంతో తమన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. వివరాలు ఇవే..

గేమ్ ఛేంజర్ సినిమాకు తాను మంచి ట్యూన్స్ ఇచ్చానని, కానీ సరైన హుక్‍ స్టెప్‍లు లేకపోవడం వల్లే పాటలకు యూట్యూబ్‍లో భారీగా వ్యూస్ రాలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో లాజిక్ మాట్లాడారు తమన్. కొరియోగ్రాఫర్లతో పాటు హీరోది కూడా బాధ్యతే అన...