భారతదేశం, మార్చి 22 -- టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు దేవిశ్రీప్ర‌సాద్‌, త‌మ‌న్ ఒకే వేదిక‌పై క‌నిపించ‌బోతున్నారు. వీరిద్ద‌రు క‌లిసి అమెరికాలో ఓ మ్యూజిక్‌ క‌న్స‌ర్ట్ చేయ‌బోతున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి.

ఈ నాట్స్ సంబ‌రాల్లో దేవిశ్రీప్ర‌సాద్‌, త‌మ‌న్ క‌లిసి మ్యూజిక్ క‌న్స‌ర్ట్ చేయ‌నున్నారు. నాట్స్ క‌ర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్ర‌వారం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో సినీ ప్ర‌ముఖులు జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్ పాల్గొన్నారు.

నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ "నాట్స్ అంటే సేవ, భాష ..ఈ రెండు పదాలు గుర్తుకువస్తాయి. అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలబడేందుకు 2009లో ఈ ...