భారతదేశం, ఫిబ్రవరి 25 -- Thalliki Vandanam Scheme : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. శాసనమండలిలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ...."శాసనమండలి సాక్షిగా చెప్తున్నా.. ఏప్రిల్/మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం" అని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ప్రతి బిడ్డకూ రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల హామీల్లో ప్రకటించాయి. పథకాల అమల్లో జాప్యంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.

"అధికారంలోకి రాగానే పింఛన్ పెంచాం. ఏడాదికి ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. చెత్తపన్ను, ల్యాండ్‍టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేని...