Hyderabad, ఫిబ్రవరి 27 -- Thalapathy Vijay: తమిళనాడులో మరో స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే అంకితం కాబోతున్నాడు. అతని పేరు దళపతి విజయ్. గతేడాదే పార్టీ పెట్టిన అతడు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతాడన్న పుకార్లకు విజయ్ చెక్ పెట్టాడు.

దళపతి విజయ్ గతేడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే) అనే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పార్టీ వార్షికోత్సవం బుధవారం (ఫిబ్రవరి 26) జరిగింది. తమిళనాడులోని మామళ్లాపురంలో జరిగిన ఈ సభలో విజయ్ తన సినిమా కెరీర్ గురించి కూడా మాట్లాడినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు వెల్లడించింది

ప్రస్తుతం తన కెరీర్లో 69వ సినిమా అయిన జన నాయగన్ చేస్తున్నాడు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదే తన కెరీర్లో చివరి సినిమా అని, తన భవిష్యత్తు మొత్తం ఇక రాజకీయాలకే అంకితమని విజయ్...