భారతదేశం, ఫిబ్రవరి 15 -- కొరియోగ్రాఫ‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్ కొంత గ్యాప్ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ త‌ల‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న‌యుడు రాగిన్ రాజ్ హీరోగా న‌టించాడు. రోహిత్‌, ఎస్తేర్‌, ఇంద్ర‌జ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

రాంబాబుకు (రాగిన్ రాజ్‌) త‌ల్లి అంటే ప్రాణం. అమ్మ కోసం ఎంత దూరం వెళ్ల‌డానికైనా, ఎవ‌రినైనా ఎదురించ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తాడు. రాంబాబు తండ్రి (రోహిత్‌)... ల‌క్ష్మి అనే మ‌రో మ‌హిళ్ల‌ను పెళ్లిచేసుకుంటాడు. త‌ల్లి కోరిక మేర‌కు తండ్రిని వెతుక్కుంటూ బ‌య‌లుదేరుతాడు రాంబాబు. తానేవ‌రో చెప్ప‌కుండా తండ్రికి ద‌గ్గ‌ర‌వుతాడు.

త‌న తండ్రి పెద్ద స‌మ‌స్య‌ల‌తో చిక్కుకున్నాడ‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది? అదేమిటి? రాంబాబు త‌ల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? తండ్రిని తీసుకొ...