భారతదేశం, మార్చి 2 -- TGSRTC UPI Payments : టీజీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్ పెట్టింది. ప్రయాణికులు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు చెల్లించవచ్చు. యూపీఐ స్కాన్ చేసి టికెట్ పొందవచ్చు. హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇక సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ చేసి టికెట్ పొందవచ్చు. యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆటోమేటిక్ ఫెర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చిన ఆర్టీసీ తెలిపింది. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ వెల్లడించింది.

గ్రేటర్ హైదరాబాద్‌లోని మొత్తం 2,200 బస్సుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా టికెటింగ్ విధానం మొదలుపెట్టినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. దీంతో చిల్లర కష్టాలు తప్పాయని అటు ప...