తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 21 -- మహాశివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది. ఈ సందర్బంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడతో పాటు పలు శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులను సజ్జనార్ కోరారు.

దక్షణకాశిగా పెరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబవుతుంది. మూడు రోజుల పాటు జ...