తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 23 -- మహాశివరాత్రి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగుండా తెలంగాణ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. శివరాత్రి సందర్భంగా మొత్తం 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

శివరాత్రికి ప్రత్యేక బస్సులను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఛార్జీలపై కూడా ఆర్టీసీ అప్డేట్ ఇచ్చింది. రెగ్యూలర్‌ సర్వీసుల టికెట్‌ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కానీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు చార్జీలు ఉంటాయని పేర్కొంది.

ఈ మేరకు స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబవర్రి 24 నుంచి 27 వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయాన్ని కల్పి...