భారతదేశం, జనవరి 27 -- తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె బాట పట్టడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించి సంస్థ ఎండీకి నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం బస్ భవన్‌లో సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత మళ్లీ సమ్మె మాట వినిపిస్తోంది.

ఆర్టీసీలో కార్మికుల హక్కులు హరిస్తున్నారని జేఏసీ ఆరోపించింది. ఈ తరుణంలో.. హక్కుల సాధనకై, రావాల్సిన ఆర్ధిక, ఇతర అంశాల కోసం సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు జేఏసీ స్పష్టం చేసింది. 'మన కోసం, మన హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో.. మనమే పాల్గొనకపోతే.. మన బానిసత్వానికి మనమే కారణం అవుతాం. పోరాడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్లు తప్ప. చరిత్ర సృష్టిద్దాం. ఆర్టీసీ కార్మికుల సత్తా మళ్లీ ఓసారి చూపిద్దాం' అని జేఏసీ...