తెలంగాణ,విజయవాడ, ఫిబ్రవరి 19 -- విజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌యాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ మార్గంలో ప్ర‌త్యేక రాయితీల‌ను ప్రకటించింది. ల‌హారి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. రాజ‌ధాని ఏసీ బ‌స్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు వెల్లడించింది.

ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టీజీఆర్టీసీ కోరింది. టీజీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది.

తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు కూడా టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల టికెట్ ధరలో 10 శాతం రాయితీని ప్రకటించింది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ జర్నీలకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ...