భారతదేశం, మార్చి 7 -- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాజమాన్యంతో చర్చించి.. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2.5 శాతం డీఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల రూ.3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

'మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా పొందారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల వరకు పెరిగింది. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగి.. వారు నిరంతరం శ్రమిస్తున్నారు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

'రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత ద...