భారతదేశం, ఫిబ్రవరి 7 -- ఆర్టీసీ జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 10న చర్చలకు రావాలంటూ నోటీస్‌ ఇచ్చింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చర్చలకు పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 10 రోజుల తర్వాత కార్మిక శాఖ సమ్మె నోటీసుపై స్పందించి, చర్చలకు ఆహ్వానించింది. అయితే.. ఈ చర్చలకు జేఏసీ నాయకులు వెళ్తారా లేదా అన్నది చూడాలి.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె సైరన్‌ మోగించేందుకు కార్మికులు రెడీ అయ్యారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 9 నుంచి సమ్మెకు దిగేందుకు యూనియన్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నోసార్లు విన్నవించామని జేఏసీ నాయకులు చెబుతున్నారు. అయినా సమస్యలు పరిష్కా...