భారతదేశం, ఫిబ్రవరి 9 -- సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా వచ్చినప్పటి నుంచి కార్మికులు, ట్రేడ్‌ యూనియన్ల హక్కుల్ని కాలరాస్తున్నారని.. ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆరోపించింది. ఆర్టీసీలో ప్రస్తుతం నెలకొన్న అశాంతికి సజ్జనారే కారణమని విమర్శించింది. కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వడానికి ప్రధాన కారణం సజ్జనార్‌ వైఖరే అని ఈయూ అధ్యక్షుడు ఎస్‌.బాబు స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి రెండు వారాలైనా ఆయన చర్చలకు పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

'నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో లక్షల రూపాయల జీతాలతో కన్సల్టెంట్లను నియమించారు. 2017 వేతన సవరణలో యూనియన్ల ప్రమేయం లేకుండా చేశారు. బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. కార్మిక సంఘాల విషయంలో గత ప్రభుత్వాన్ని, ప్రస్తుత సర్కారును పక్కదారి పట్టించారు' అని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బాబు శనివారం ఆరోపించారు.

ఆర్టీసీ జేఏసీని కార్మిక ...