భారతదేశం, జనవరి 7 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంక్రాంతి సందర్భంగా రాష్ట్రం అంతటా, పొరుగు రాష్ట్రాలకు 6,431 ప్రత్యేక బస్సుల నడపనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రయాణానికి ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నది.

జనవరి 9, 10, 12, 13 తేదీలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, డిమాండ్ ఆధారంగా అదనపు సర్వీసులను మోహరించాలని రవాణా సంస్థ అనుకుంటోంది. ఇక జనవరి 18, 19 తేదీలలో తిరుగు ప్రయాణ రద్దీకి కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్‌బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయినపల్లి, గచ్చిబౌలి వంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాల ను...