భారతదేశం, మార్చి 4 -- మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలకు బస్సులను కేటాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు బస్సులు కేటాయించనున్నారు. త్వరలో మిగిలిన 450 సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనున్నారు. ఒక్కో బస్సుకు రూ.77,220 అద్దె చెల్లించనుంది తెలంగాణ ఆర్టీసీ.

ఈ బస్సుల కొనుగోలుకు కూడా ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. దేశంలోనే తొలిసారిగా స్వయం సహాయక సంఘాలకు అద్దె ఆర్టీసీ బస్సులు రానున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.

మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర...