భారతదేశం, ఫిబ్రవరి 7 -- TGRTC Strike: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్‌ మోగించేందుకు కార్మికులు రెడీ అవుతున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 9 నుంచి సమ్మెకు దిగేందుకు యూనియన్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, కారుణ్య నియామకాలు చేసినవారిని రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలనే.. తదితర డిమాండ్లతో సమ్మెకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు కరీంనగర్ రీజియన్ పరిధిలో అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి జిల్లా చైర్మన్ ఎంపీ.రెడ్డిని ఎన్నుకున్నారు.

ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు ఆర్టీసీ మేనేజ్మెంట కు ఎన్నోసార్లు విన్నవించామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ కరీంనగర్ ...