తెలంగాణ,హైదరాబాద్, మార్చి 21 -- తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన విద్యార్థులు. మార్చి 24వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు వివరాలను పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 24న ప్రారంభం కాగా. ఏప్రిల్ 23వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ...