తెలంగాణ,హైదరాబాద్, మార్చి 14 -- తెలంగాణ గ్రూప్స్ పరీక్షలు ఫలితాలు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, 2 ఫలితాలు రాగా. మరికాసేపట్లో గ్రూప్ 3 ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటిస్తారు. ఆ తర్వాత నియామక జాబితాను ప్రకటిస్తారు.

రాష్ట్రంలో 1365 గ్రూప్‌ 3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 50.24శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటంతో. ఇవాళ ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించనున్నారు.

తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరు...