భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల అయ్యాయి. 1,370 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన ప్రొవిజినల్‌ జాబితాను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షలను గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించారు. మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.

రాష్ట్రంలో 1365 గ్రూప్‌ 3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 50.24శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటంతో. ఈ ఏడాదిలో మార్చిలో ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించారు. అంతేకాకుండా ఫైనల్ కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Published by HT Di...