భారతదేశం, మార్చి 11 -- తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదల చేశారు టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్ర వెంకటేశం. అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదల అయ్యింది. అభ్యర్థులు తమ ఫలితాలను www.tspsc.gov.in లో చూసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్‌ లింక్ ఓపెన్ చేశాక.. గ్రూప్ 2 సర్వీస్ జనరల్ ర్యాకింగ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే.. పీడీఎఫ్ ఫార్మాట్‌ వివరాలు ఓపెన్ అవుతాయి. అలాగే ప్రశ్నాపత్రాలు, ఫైనల్ కీ కావాలంటే కూడా అందుబాటులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే.. వివరాలు కనిపిస్తాయి. వీటికి సంబంధించి ఏ సమస్య ఉన్నా.. హెల్ప్ లైన్ నంబర్ 040-22445566 నంబర్‌కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

గ్రూప్-2 పరీక్ష నాలుగు సెషన్లలో జరిగింది. డిసెంబర్ 15 ఉదయం, మధ్యాహ్నం పేపర్ 1, 2.. డిసెంబర్ 16 ఉదయం, మధ్యాహ్నం పేపర్ 3, 4 పరీక్షలు నిర్వహి...