భారతదేశం, మార్చి 10 -- TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్‌ మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ లో అభ్యర్థులు తమ లాగిన్‌ వివరాలతో మార్కులు తెలుసుకోవచ్చు. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ గతేడాది అక్టోబర్ లో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో 67.17శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అక్టోబర్ 21 నుంచి నిర్వహించిన పరీక్షలు అక్టోబర్ 27తో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వ...