భారతదేశం, ఏప్రిల్ 9 -- TGPSC Group 1 : టీజీపీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించే తేదీలను ప్రకటించింది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వెల్లడించింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉందని పేర్కొంది. ఎంపికైన వారు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించింది.

గ్రూప్-1 సర్వీసెస్ పరిధిలోని 563 ఖాళీలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.30 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అలాగే రిజర్వ్ డే 22/04/2025 ఉదయం 10:30 నుండి సాయంత్రం 5.30 వరకు...