భారతదేశం, ఏప్రిల్ 14 -- తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాలు దేశంలోనే పెద్ద కుంభకోణం అని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ప్రిలిమ్స్ లో ఓ హల్ టిక్కెట్.. మెయిన్స్ లో మరో హాల్ టికెట్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని వ్యాఖ్యానించారు. ఇక్కడే కుంభకోణం మొదలైందన్న కౌశిక్.. 21 వేల 93 మంది పరీక్షలు రాస్తే.. 21 వేల 103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్.. కీలక అంశాలను లేవనెత్తారు.

'పది మంది అదనంగా ఎక్కడ్నుంచి వచ్చారు. తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలి. 654 మందికి ఓకే మార్కులు వచ్చాయి.. ఎలా సాధ్యం. పేపర్లు ఎలా దిద్దారో తెలియదు. నేను టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి సేకరించే మాట్లాడుతున్నా. పేపర్లు ఆరవై రోజుల్లోనే దిద్దారు. నాలుగైదు నెలలైనా సమయం పడుతుంది. పదివేల మంది పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం 69 మంది...