భారతదేశం, మార్చి 31 -- TGIIC On HCU Land Issue : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. హెచ్.సి.యు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వర్సిటీ భూములు చదును చేయడాన్ని ఆపాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీంతో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద, లోపన భారీగా పోలీసులను మోహరించారు. బయట వారిని వర్సిటీలోకి అనుమతించడంలేదు. అయితే ఈ వివాదంపై టీజీఐఐసీ తాజాగా స్పందించింది.

కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో హెచ్‌సీయూ భూములు లేవని స్పష్టంచేసింది. ఈ భూములు ప్రభుత్వానివేనని కోర్టులో నిరూపించుకుందని వెల్లడించింది. ఓ ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని కోర్టులో న్యాయపోరాటం ద్వారా దక్కించుకుందని తెలిపింది. ప్రస్తుతం...