భారతదేశం, డిసెంబర్ 11 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన విద్యార్థులు. వచ్చే జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్చారు. ప్రవేశ పరీక్షను వచ్చే ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.

అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కే...