భారతదేశం, ఫిబ్రవరి 28 -- తెలంగాణలోని పోలీసు పిల్లలకు, ఇతర యూనిఫాం సర్వీస్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం.. ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌‌ను ఏర్పాటు చేసింది. పాఠ్యాంశాలతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, క్రీడలు, సామాజిక స్పృహ, ఉన్నత విలువలను పెంపొందించడం దీని లక్ష్యం. తాజాగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి 1 నుంచి 5వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ స్కూల్‌లో 50 శాతం పోలీస్ కుటుంబాల పిల్లలకు, మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయించనున్నారు. పూర్తి వివరాలకు 90591 96161 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

అధికారిక వెబ...