తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 23 -- మందుబాబులకు బ్యాడ్ న్యూస్.! రాష్ట్రంలోని మూడు రోజుల పాటు లిక్కర్ దుకాణాలు బంద్ కానున్నాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా. అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి.

రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం-వరంగల్- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. దాదాపు ఎన్నికల ప్రచారం కూడా పూర్తి కావొచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.కల్లు క...