భారతదేశం, జనవరి 26 -- TG Welfare Schemes : తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా లబ్దిదారులకు పథకాల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లెపల్లిలో నిర్వహించిన ప్రజా పాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ...రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు.

ఇందిరమ్మ రాజ్యంలో కష్టాలు తీరుతాయని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకేరోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించు...