భారతదేశం, ఏప్రిల్ 6 -- తెలంగాణ ప్రభుత్వం రెండు సంక్షేమ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. వీటి అమలు కోసం మూడు నెలల్లో దాదాపు రూ.15 వేల కోట్లు అవసరం అని తెలుస్తోంది. ఆ నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ వనరులు, రుణాలపై ఆర్థిక శాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు.

రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా.. ఇప్పుడు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులను ఎంపిక చేసి.. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్థిక సాయం మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకానికి రూ.6 వేల కోట్లు ఇస్తామని స్పష్టం చేసింది. జూన్‌ 2 నాటికి ఈ పథకం కోసం రూ.6 వేల కోట్లు నిధులు కావాలి.

ఇక జూన్‌ నుంచే ఖరీఫ్‌ పంటల సాగు సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ న...