భారతదేశం, జనవరి 26 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలోని ఒక గ్రామంలో జనవరి 26న 4 పథకాలకు సంబంధించి నూరు శాతం అమలు చేయబోతున్నట్లు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినందునా.. మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని.. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ ప్రక్రియలో ఎవరూ మిగిలిపోరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని, భూమిలేని నిరుపేద, ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే.. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. ప్రశ్నలు సంధించారు.

'భట్టి గారు.. మండలానికి ఒక గ్రామ...