భారతదేశం, జనవరి 27 -- ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని సత్తుపల్లి 32వ వార్డు ఆఫీసర్ నల్లంటి వినోద్ లంచం అడిగారు. లంచం ఇస్తే.. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తును ప్రాసెస్ చేస్తానని చెప్పారు. దీంతో దరఖాస్తుదారులు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం రూ.2500 లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను జనవరి 26న ప్రారంభించింది. మొత్తం 561 గ్రామాల్లో నాలుగు సంక్షేమ పథకాల అమలు ప్రారంభమైంది. ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మంజూరు పత్రాలు అందజేశారు.

561 గ్రామాల్లో లబ్ధిదారుల సంఖ్య ఇలా...