తెలంగాణ,కరీంనగర్, ఏప్రిల్ 2 -- త్వరలో స్థానిక సంస్థల ఎన్నిక లకు నగారా మోగనుంది. ఎన్నికల సంఘం ఓటరు నమోదును నిరంతర ప్రక్రియగా చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కటాఫ్ తేదీని ఖరారు చేసి తుది ఓటరు జాబితాను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఎప్రిల్ 1 నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి ఓటుగా నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు.

గతంలో ఓటర్ల నమోదుకు జనవరి1 తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. సదరు తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా అర్హత లభించేది. సదరు విధానానికి స్వస్తి పలికారు. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. జాబితాలో లాజికల్ పొరపాట్లు, డెమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తిస్థాయిలో సవరించాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఏప్రిల్ లో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి యంత్రాంగం స...