తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 6 -- టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) వేసవి శిక్షణ కోర్సుపై ప్రకటన విడదలైంది. రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి జూన్‌ 11 వరకు ఈ శిక్షణ ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5 జిల్లాల్లో ఈ శిక్షణ ఉంటుంది.

టెక్నిక‌ల్ టీచ‌ర్ స‌ర్టిఫికేట్ (టీటీసీ) వేస‌వి ట్రైనింగ్ కోర్సుల‌కు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన జారీ చేసింది.మే 1వ తేదీ నుంచి జూన్‌ 11 వరకు ఈ శిక్షణ ఉండనుంది.హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ కోర్సు అందుబాటులో ఉండనుంది.

ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 29వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. మే 1వ తేదీ నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేస...