భారతదేశం, జనవరి 16 -- తెలంగాణ టెట్ - 2026 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈసారి మొత్తం 2.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పలు సబ్జెక్టులు పూర్తి కాగా.. జనవరి 20వ తేదీతో అన్ని పేపర్లు పూర్తవుతాయి.

టీజీ టెట్ పరీక్షల కోసం మొత్తం 18 జిల్లాల్లో 97 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలు చేపట్టారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు. వీరంతా కూడా పరీక్షలకు హాజరవుతున్నారు.

జనవరి 20వ తేదీతో టెట్ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత ప్రాథమిక కీలు అందుబాటులోకి వస్త...