భారతదేశం, ఫిబ్రవరి 10 -- తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET) ఫలితాలను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. తాజాగా పాఠశాల విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ద్వారా వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించి వారి అర్హత స్థితిని చెక్ చేయవచ్చు. ఇటీవల టెట్ ప్రాథమిక కీ ని విడుదల చేశారు అధికారులు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫలితాలు, కీ ని వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు.

గణాంకాల ప్రకారం 37,893 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులతో సహా మొత్తం 100,270 మంది అభ్యర్థులు (51.37 శాతం) అర్హత సాధించినట్లు ప్రకటించారు. తెలంగాణలోని పాఠశాలల్లో I నుండి VIII తరగతుల వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం టీజీ టెట్ 2026 జనవరి 3 నుండి 20, ...