భారతదేశం, మార్చి 1 -- TG Summer Temperatures : రానున్న మూడు నెలలు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2025 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని ప్రకటించింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతాయని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక వేడి ఉంటుందని హెచ్చరించింది. రాత్రి ఉష్ట్రోగ్రతలు కూడా సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 1901-2025 మధ్య సగటు ఉష్ణోగ్రతలు తీసుకుంటే ఈ ఏడాదే తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

శీతాకాలం ముగుస్తుండడంతో...వేసవి ఉష్ణోగ్రతలు క్రమంలో పేరుగుతున్నాయి. మార్చి 1 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో మార్చి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు 40deg స...