భారతదేశం, మార్చి 18 -- TG Stamps Registration : తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ సేవలను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రజలకు వేగవంతమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుకింగ్ తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేస్తామన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న స్థలాల్లో గజం రిజిస్ట్రేషన్‌ చేసినా కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. భూముల క్రమబద్దీకరకు ఎల్‌ఆర్‌ఎస్‌ వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు.

ప్రస్తుతం ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్‌ చేసేందుకు దాదా...