భారతదేశం, ఏప్రిల్ 29 -- గతంలో పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్‌ ప్రింట్ చేస్తారు. చివరిగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా అనే వివరాలను ముద్రిస్తారు.

వీటితో పాటు బోధనేతర కార్యక్రమాలలో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించి గ్రేడ్లు మెమోలపై ముద్రిస్తారు

తెలంగాణ ఫలితాలను సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల వ...