Telangana,hyderabad, ఏప్రిల్ 30 -- తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.

మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా... ఏప్రిల్ మూడో వారం నాటికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాలను పూర్తి చేశారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి.... ఫలితాల వెల్లడి తేదీని అధికారులు ప్రకటించారు.

గతంలో పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ...