తెలంగాణ,హైదరాబాద్, మార్చి 7 -- తెలంగాణ పదో తరగతి విద్యార్థుల హాల్‌టికెట్లు వచ్చేశాయ్..! విద్యార్థులు బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా. వారు చదివే స్కూళ్లలో కూడా అందుబాటులో ఉంటాయి. ఏమైనా కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతుాయి. ఈ ఏడాది 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ లీకేజ్ వంటి వాటికి ఎలాంటి అస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నారు.

ఇక ఇప్పటికే విద్యాశాఖ టెన్త్ వార్షిక షెడ్యూల్‌ ను విడుదల చేసిన స...