భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణ టెన్త్ విద్యార్థుల కోసం విద్యాశాఖ మరో నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి ఏడాది ఎంతో కొంత మంది విద్యార్థులు సెంటర్ల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు సకాలంలో వెళ్లలేక పరీక్షలు కూడా తప్పుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే ఈ సమస్య ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా.. విద్యాశాఖ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ను ముద్రించే యోచనలో ఉంది.

క్యూఆర్ కోడ్ ముద్రణకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేయగా. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. ఈసారి జరగబోయే పరీక్షల కోసం విడుదల చేసే హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉండనుంది. ఫలితంగా విద్యార్థులు.. వారి సెంటర్లను చాలా సులభంగా గుర్తించే అవకాశాలుంటాయి. జస్ట్ స్మార్ట్ ఫోన్‌‌‌‌‌‌‌‌తో ఆ కోడ్‌‌‌‌‌‌‌‌...