భారతదేశం, జనవరి 7 -- తెలంగాణ పదో తరగతి పరీక్షలపై మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లింపుల గడువు పూర్తి కాగా. అధికారులు మరో అవకాశం కల్పించారు. తత్కాల్‌ పథకం కింద రూ.1000 ఆలస్య రుసుంతో ఈ నెల 21 నుంచి ఫీజు చెల్లించుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ గడువు జనవరి 27వ తేదీతో ముగియనుంది. ఇక జనవరి 29వ తేదీలోపు విద్యార్థుల సమాచారాన్ని ఆయా హెడ్ మాస్టర్లు. డీఈవోలకు సమర్పించాల్సి ఉంటుంది.

ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి.. పరీక్ష రుసుము చెల్లించడానికి గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండదు. విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు.

మరోవైపు కొద్దిరోజుల కిందటే తెలంగాణ పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ 2026 విడుదలైంది. మార్చి 2026లో ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. 2026 మార్చ...