భారతదేశం, మార్చి 18 -- రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లాల విద్యాశాఖాధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటికే జిల్లాల్లో డీఈవోలు పరీక్షా కేంద్రాలను గుర్తించారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల ఏర్పాట్లపై ఫిబ్రవరిలో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్‌లు సమీక్షించారు.

పరీక్షల నిర్వహణకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులను, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. కేంద్రానికో ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక పోలీసు అధికారి, ఇద్దరు అటెండర్లను నియమించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఉంటాయి. ఇందులో విద్యా, రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి ఒక్కొక్కరు ఉంటారు. సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఉంటాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరీక్ష సరళిని తనిఖీ చేస్త...