తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- పరీక్షల వేళ పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం(స్నాక్స్) ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు షెడ్యూల్ ను ప్రకటించింది.

రాష్ట్రంలో మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈసారి పాస్ శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. అయితే చాలా గ్రామాల్లోని విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా.. ప్రభుత్వం స్నాక్స్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. గతంలో కూడా ఈ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 1 నుంచి స్నాక్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. మార్చి 20వ తేదీ వరకు పంపిణీ చేస్తారు. మొత్తం 38 రోజులపాటు అల్పాహారం ఇచ్చేలా విద్యాశాఖ కార...