Telangana,hyderabad, ఏప్రిల్ 9 -- తెలంగాణలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఏప్రిల్ 4వ తేదీతో ఎగ్జామ్స్ అన్నీ పూర్తి కాగా.. ఏప్రిల్ 7వ తేదీ నుంచే స్పాట్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదీలోపు పూర్తి చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఈనెలాఖారులోపే ఫలితాలను వెల్లడిస్తారు.

జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పకడ్బందీగా చేస్తున్నారు. విద్యార్థుల జవాబు పత్రాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. చీఫ్‌ ఎగ్జామినర్లు(సీఈలు), అసిస్టెంట్‌ ఎగ్జామినర్లే కాకుండా స్పెషల్‌ అసిస్టెంట్లు కూడా విధుల్లో ఉన్నారు. అన్ని దశల్లో జవాబు పత్రాలను పరిశీలించి. మూల్యాంకనం పూర్తి చేస్తున్నారు.

ఏప్రిల్ 15వ తేదీతో మూల్యాంకన ప్రక్రియ పూర్తి అయితే. ఆ వెంటనే కోడింగ్, డీకోడిం...