తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 5 -- తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో విద్యార్థుల ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేశారు.

రాష్ట్రంలో ఏప్రిల్ 4వ తేదీతో పదో తరగతికి సంబంధించిన అన్ని పేపర్లు పూర్తవుతాయి. దీంతో రేపట్నుంచి (ఏప్రిల్‌ 7) జవాబు పత్రాల మూల్యాంకం ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ నడవనుంది.

టెన్త్ స్పాట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా స్పాట్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్పాట్ పూర్తైన వెంటనే మార్కులను ఎంట్రీ చేస్తారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి. తుది ఫలితాల ప్రకటనకు సిద్ధం చేస్తారు.

కోడింగ్, డీకోడింగ్ తో సహా...